కె సి ఆర్ ఒక నియంత

కోవిడ్ 19 వచ్చిన దగ్గర నుండి కె సి ఆర్ చాలా హుషారు గా పని చేస్తుండని అందరూ అన్నారు కానీ నిజానికి కరోనా టెస్టులు విషయంలో చాలా నిర్లక్షయం గా వ్యవహరించారని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేశ సగటు టెస్టులు కన్నా తెలంగాణ చేసిన టెస్టులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటి వరకు మొత్తం 4.5 కోట్ల జనాభా కి గాను సుమారు 1.3 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణ లో మొత్తం 3 కోట్ల జనాభా కి సుమారు 25000 టెస్టులు చేశారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కూడా తప్పుబట్టింది అలానే హైకోర్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయిన కె సి ఆర్ గారు ఏమి పట్టనట్టు ఒక నియంత లాగా ప్రవతిస్తున్నారు. కరోన కేసులు ఎక్కువ గా పెరిగితే ప్రజలు తనని ప్రశ్నించడం మొదలు పెడతారు అని కె సి ఆర్ అనుకున్నటు ఉన్నారు. కానీ ఒక్క విషయం లో విజయం సాధించింది కె సి ఆర్ ప్రభుత్వం. కరోన ని గ్రామాల్లోకి రానివ్వకుండా చాలా వరకు కట్టడి చేసింది.

కానీ హైదరాబాద్ లో మాత్రం చాలా ప్రజలకి ఇప్పటికే కరోన వచ్చి ఉంటుంది ఎందుకంటే కేవలం 54% ప్రజలలో కరోన లక్షణాలు కనిపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్నీ లక్షణాలు కనిపిస్తేనే టెస్టులు చేస్తుంది. లాక్ డౌన్ ను హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల తీసేయడమ్ జరిగింది. టెస్టులు తక్కువ చేయడం వల్ల కరోన ఉన్న వ్యక్తి కూడా చాలా మందికి సోకించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి ఐన టెస్టులు ఎక్కువగా చేసి కరోన ఉన్న వ్యక్తి ని క్వారంటీన్ కు తరలించాలి.

ఇప్పటికే హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఐ సి యం ఆర్ చెప్పిన ప్రైవేట్ ల్యాబ్ లో కూడా ప్రజలు కరోన పరీక్షలు చెపిచ్చుకోవటానికి అనుమతి ఇచ్చింది తెలిసిందే.

Leave a comment

Start a Blog at WordPress.com.

Up ↑

Design a site like this with WordPress.com
Get started